ఏపీపీఎస్సీ 2016లో వన్‌టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (One TimeProfile Registration- OTPR) అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. కమీషన్ నిర్వహించే ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే.. ఓటీపీఆర్ తప్పనిసరి. ఈ విధానంలో అభ్యర్థులు తమ పేరు, పుట్టిన తేది, ఆధార్ నంబర్, చిరునామా, విద్యార్హతలు, ఉద్యోగానుభవం వంటి పూర్తి వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. విజయవంతంగా రిజిస్టర్ చేసుకున్నవారికి ఒక శాశ్వత రెఫరెన్స్ నెంబర్, పాస్‌వర్డ్ వస్తాయి. అంటే ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థికి సంబంధించిన పూర్తి సమాచారం ఏపీపీఎస్సీతో ఉంటుంది.
ఈ విధానం కొత్త కావడంతో చాలా మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందులకు గురవుతున్నారు. వీటితో పాటు ఫారం మొత్తం నింపిన తర్వాత సబ్‌మిట్ కొట్టే సమయంలో టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. దీంతో మళ్లీ మొదటినుంచి రావాల్సి ఉంటుంది. ఓటీపీఆర్, గ్రూప్-2 కి దరఖాస్తు చేయాలంటే కనీసం 30 నుంచి 50 నిమిషాల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో వన్‌టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మరియు గ్రూప్-2 దరఖాస్తు విధానాన్ని చిత్రపటాల సహాయంతో మీకందిస్తున్నాం. దీనిని అనుసరించడంతో సులువుగా దరఖాస్తు చేయవచ్చు. మీ విలువైన సమయం ఆదా అవుతుంది.
సిద్ధంగా ఉంచుకోవాల్సినవి: దరఖాస్తు చేసే అభ్యర్థులు ముఖ్యంగా కింది విషయాలకు సంబంధించిన సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. అవి
ప్రాథమిక వివరాలు: అభ్యర్థి పేరు, తల్లితండ్రుల పేర్లు, పుట్టిన తేది, పుట్టిన ప్రదేశం,ఆధార్ నంబర్, మాతృభాష, మతం, పుట్టుమచ్చలు, చిరునామా తదితరాలు
విద్యాభ్యాసం వివరాలు: ఒకటో తరగతి నుంచి పది, ఇంటర్, డిప్లమో, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, ఎంఫిల్ వంటి తరగతులకు సంబంధించి పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయం పేరు, చదివిన ప్రదేశం, జిల్లా, గ్రూప్స్ (సబ్జెక్టులు), రోల్‌నెంబర్ (హాల్‌టికెట్ నంబర్), ఉత్తీర్ణతా శాతాలు /గ్రేడ్‌లు, ఉత్తీర్ణత చెందిన సంవత్సరం తదితరాలు
ఉద్యోగానుభవం వివరాలు: ఇదివరకే ఉద్యోగానుభం ఉంటే కంపెనీ వివరాలు, అనుభవం వంటి విషయాలు గుర్తుంచుకోవాలి.
ఫోటోగ్రాఫ్, సంతకం: 50 kb కి మించకుండా 3.5 cm × 4.5 cm సైజులో పాస్‌పోర్ట్ ఫోటో మరియు 30kb కి మించకుండా 3.5 cm × 1.5 cm సైజులోసంతకంను JPG/JPEG ఫార్మాట్‌లో సిద్ధంగా ఉంచుకోవాలి. సైజుల్లో ఏ మాత్రం తేడా ఉన్న ఫోటో, సంతకం అప్‌లోడ్ కావు.
పోస్టుల వివరాలు: నోటిఫికేషన్ క్షుణ్నంగా చదివి పోస్టుల పేర్లు, పోస్టు కోడ్‌లు, పోస్టుల ప్రాధాన్యత క్రమం, జోన్ల ప్రాధాన్యత క్రమం వంటి వివరాలతో సిద్ధంగా ఉండాలి.
For detailed visualisation please click here
http://www.sakshieducation.com/GII-APPSC/Story.aspx?nid=148621&cid=2&sid=485&chid=0&tid=0
- This topic was modified 8 years, 2 months ago by Rama Krishna.