తప్పుల తడకగా ఏపీసెట్ 2016 ఫైనల్ ‘కీ’

Share.

Posted In: APSET

    • Profile photo of Rama Krishna
      Keymaster
      Rama Krishna on #3418

      పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టులో 3 తప్పులు
      పున:పరిశీలించాలంటున్న అభ్యర్థులు.. పట్టించుకోని అధికారులు
      ఫలితాలు, స్కోర్ కార్డు విడుదల
      రేపో మాపో అర్హత పత్రాల జారీ

      Education News సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్) 2016 ఫైనల్ కీ తప్పుల తడకగా మారింది. 31 సబ్జెక్టుల్లో ఒక ఆప్షనల్ అయిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, 3లో మూడు తప్పులు దొర్లాయి. ఫైనల్ ‘కీ’ లో కూడా తప్పులున్నాయంటూ అభ్యర్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.

      రాష్ట్రవ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ల నియామకం కోసంఆంధ్రా విశ్వవిద్యాలయం ఏపీ ప్రభుత్వం తరపున సెప్టెంబర్ 11నసెట్ పరీక్ష నిర్వహించింది. ఆ తర్వాత దీనికి సంబంధించిన ప్రాథమిక ‘కీ’ విడుదల చేసి అభ్యంతరాలను కోరింది. అయితే తప్పు సమాధానాలపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అధికారులు కొన్నింటినే మార్చి మిగిలిన వాటిని తుదీ ‘కీ’ లో అలాగే కొనసాగించారు. వాటి ఆధారంగానే ఈ నెల 20న ఫలితాలు, 22న స్కోర్ కార్డు విడుదల చేశారు. నవంబర్ మొదటి వారంలో అర్హత పత్రాలు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అధికారులతో ‘కీ’ ని పునఃపరిశీలించి ఫలితాలు విడుదల చేయాలని అభ్యర్థులు కోరినా పట్టించుకోకపోవడం గమనార్హం.

      ఇదివరకే 2011 లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో దొర్లిన తప్పుల కారణంగా కోర్టులకెళ్లిన అభ్యర్థులు 4 సంవత్సరాల తర్వాత తిరిగి మెయిన్స్ రాయాల్సి వచ్చింది. తాజాగా ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో స్వల్ప తేడాతో అనర్హులు కానున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

      తప్పులు దొర్లిన ప్రశ్నలు ఇవే..
      PAPER-2
      Q-22: Lokapal Bill was introduced last in the year-
      (A) 1996
      (B) 1995
      (C) 1998
      (D) 1999
      AP SET Preliminary Key: Option B
      AP SET Final Key: Option C
      Correct Answer: Not given in the Options (It was introduced again in the years of 1998, 2001, 2005 and 2008)
      Reerence Books:
      Public Administration by Lakshmikanth – Page No. 224
      UGC NET/JRF/SET Political Science (Paper II & III) by Upkars Publications – Page No. 19

      PAPER-3
      Q-23: Two factor theory of motivation was proposed by-
      (A) Douglash McGragor
      (B) Abraham Maslow
      (C) Fedrick Herzberg
      (D) Herbert A Simon
      Answer from APSET final key: Option B – Abraham Maslow
      Correct Answer: Option C – Fedrick Herzberg
      Reference Books:
      Public administration (The McGRAW-Hill), Page no:184 (Last line) & (185)
      Fundamentals of Management (By Ricky Griffin), Page no:295

      PAPER-3
      Q-47: The expenditure charged on the consolidated fund of India comprises of-
      1. Pension payable to judges of High court
      2. Debt charges for which the Government of India is liable.
      3. Salary, allowances and pension payable to the employees of C & A.G. Office.
      Which of the statements given above are correct?
      (A) 1, 2 and 3
      (B) 1 and 2 Only
      (C) 1 and 3 Only
      (D) 2 and 3 Only
      Answer from APSET Final key: Option B – 1 and 2 Only
      Correct Answer: Option A – 1, 2 and 3
      Reference Books:
      Public administration (The McGRAW-Hill) & Laksmikanth (Indian polity)
      Book Name: 1000 Plus Questions on Indian Polity (The McGRAW-Hill Education Series)

You must be logged in to reply to this topic.